మీరు ఇప్పటిదాకా ఆన్లైన్(ఫోన్ పే, గూగుల్ పే) ద్వారా కరెంటు బిల్లులు చెల్లిస్తున్నారా.. ఇక నుంచి అలా పంపకండి. ఒకవేళ అలాగే చెల్లింపులు చేస్తే మాత్రం మీ బిల్లులు విద్యుత్తు శాఖకు చేరవు. సర్వీసు ప్రొవైడర్లయిన ఫోన్ పే, గూగుల్ పే(Google Pay), అమెజాన్ పే, పేటీఎం(Paytm) ద్వారా చెల్లించడం బంద్ చేయాల్సి ఉంటుంది.
ఆర్బీఐ ఆదేశాలతో…
RBI తాజా గైడ్ లైన్స్ ప్రకారం 2024 జులై 1 నుంచి సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా స్వీకరించే బిల్లులు నిలిచిపోయాయని.. కాబట్టి ఫోన్ పే, గూగుల్ పే వంటి వాటి ద్వారా చెల్లింపులు చేయొద్దని TGSPDCL(తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్) కోరింది. మొదట్లో కరెంటు బిల్లుల్ని గ్రామాల్లోని ఆఫీసుల్లో, ఆ తర్వాత మీ-సేవ సెంటర్లలో చెల్లించేవారు.
మరెలా…
ఇక నుంచి కరెంటు బిల్లుల చెల్లింపులు విద్యుత్తు శాఖకు సంబంధించిన మొబైల్ యాప్ లేదా వెబ్ సైట్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. TGSPDCL మొబైల్ యాప్, వైబ్సైట్ ద్వారా చెల్లిస్తేనే సరి.. లేదంటే డబ్బులు గోవిందా. ఇవి రెండూ కుదరకపోతే పాత పద్ధతిలోనే కరెంటు కార్యాలయాల వద్ద చెల్లించాలని TGSPDCL కోరింది.