ట్విటర్ కు పోటీగా థ్రెడ్స్ యాప్ అందుబాటులోకి వచ్చింది. ఇవాళ్టి నుంచి యాప్ ను వాడుకోవచ్చని ఫేస్ బుక్ మాతృసంస్థ ‘మెటా’ తెలిపింది. ఈ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫామ్ లో ట్విటర్ తరహా ఫీచర్లన్నీ ఉంటాయని ప్రకటించింది. ఇన్ స్టాగ్రామ్ బ్రాండ్ తరహాలో తీసుకువచ్చిన ఈ అప్లికేషన్ లో… టెక్స్ట్ రూపంలో ఉన్న పోస్టులను లైక్ చేయవచ్చు. కామెంట్, షేర్ చేసే వెసులుబాటు కూడా ఉండనుంది. ఇన్ స్టాగ్రామ్ లో ఫాలో అయ్యేవారే దీనిలో కూడా కంటిన్యూ అవ్వొచ్చు. ఇన్ స్టాగ్రామ్ లోని అదే యూజర్ నేమ్ తో యాప్ ను యూజ్ చేసుకోవచ్చు.
ఎలాన్ మస్క్ ట్విటర్ ను కొన్నప్పట్నుంచి దానిపై పరిమితులు విధించడం యూజర్లకు ఇబ్బందికరంగా తయారైంది. దీన్ని అవకాశంగా మలచుకోవాలని భావించిన మెటా సంస్థ… యూజర్లను ఆకర్షించేందుకు ‘థ్రెడ్స్’ యాప్ ను తీసుకువచ్చింది.