IT ఉద్యోగులు అందరూ ఒకేసారి ఇళ్లకు వెళ్లకుండా 3 దశల్లో లాగ్ అవుట్ చేయాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. మంగళ, బుధవారాల్లో 3 దశల్లో లాగ్ అవుట్ చేసుకోవాలని సైబరాబాద్ పోలీసులు తెలియజేశారు. భారీగా వర్షాలు పడుతున్న దృష్ట్యా ఈ రెండు రోజులు 3 షిఫ్టులు మెయింటెయిన్ చేయాలని చెబుతున్నారు. వర్షాల ఎఫెక్ట్ తో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్న దృష్ట్యా సైబరాబాద్ పోలీసు శాఖ ఈ డిసిషన్ తీసుకుంది. ఈ మేరకు గైడ్ లైన్స్ ను IT కంపెనీలకు అందజేసింది.
ఐకియా నుంచి సైబర్ టవర్స్ వరకు ఉండే ఆఫీసులు మధ్యాహ్నం 3 గంటలకు లాగ్ అవుట్(Log Out) చేయాలి.
ఐకియా నుంచి బయోడైవర్సిటీ వరకు గల ఆఫీసులు సాయంత్రం 4:30 గంటలకు లాగ్ అవుట్ చేయాలి.
ఐకియా నుంచి రాయదుర్గం వరకు గల ఆఫీసులు సాయంత్రం 4:30 గంటలకు లాగ్ అవుట్ చేయాలి.
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్, గచ్చిబౌలి ఏరియాల్లో ఉండేవి మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల లోపు లాగ్ అవుట్ చేయాలి.