ఇంటర్నేషనల్ లెవెల్లో బంగారం(Gold) ధరలు పెరుగుతుండటంతో దేశంలోనూ వాటి కొనుగోళ్లపై ప్రభావం పడుతోంది. 10 గ్రాముల బంగారం నిన్నటితో పోల్చితే ఈ రోజు సుమారుగా రూ.160 పెరిగి.. బుధవారానికి రూ.60,740కి చేరుకుంది. అయితే వెండి రేట్లు మాత్రం స్థిరంగా ఉన్నాయి. బుధవారం కిలో వెండి ధర రూ.20 పెరిగి 73,050కు చేరుకుంది. అంతర్జాతీయ స్థాయిలో పసిడి ధరలు క్రమంగా పెరుగుతున్నాయని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
హైదరాబాద్ తోపాటు విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి రేట్… రూ.60,740 గా నమోదైంది.