స్టాక్ మార్కెట్లు ఈ రోజు ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. BSE సెన్సెక్స్ 79,000కు పైగా, NSE నిఫ్టీ 24,000 పాయింట్లకు పైగా ట్రేడవుతూనే ఉన్నాయి. స్టార్టింగ్ లోనే BSE సెన్సెక్స్ 79,071.24కి.. నిఫ్టీ 24,034.65 పాయింట్లకు చేరింది. గత వారం మాదిరిగానే లాభాల ట్రెండ్ కొనసాగిస్తూ సోమవారం మార్కెట్లు పాజిటివ్ వేవ్ తో కనిపిస్తున్నాయి.
ఎకనమిక్ డేటా పాయింట్లు ఈ వారంలో విడుదల కానున్న దృష్ట్యా మార్కెట్లలో సానుకూల ఫలితాలున్నా ఒడిదొడుకులు మాత్రం కనిపిస్తున్నాయి. రాజకీయ అనిశ్చితి(Uncertainity), ఆర్థిక మాంద్యం వంటి అనుమానాలతో అమెరికా మార్కెట్లు శుక్రవారం భారీగా పడిపోయాయి. US పరిణామాల్ని నిశితంగా గమనిస్తున్న ఆసియా మార్కెట్లు ఊగిసలాట ధోరణితో ఉన్నాయి. డాలర్ తో రూపాయి మారకపు విలువ 83.34గా ఉంది.