ఒక్కరోజు వ్యవధిలోనే స్టాక్ మార్కెట్(Stock Market)లో భారీ తేడాలు కనిపించాయి. సోమవారం నాడు లాభాలతో ప్రారంభమై భారీ బెనిఫిట్స్ మూటగట్టుకున్న సెన్సెక్స్, నిఫ్టీ.. ఈ రోజు నష్టాల్లో కూరుకుపోయాయి. సెన్సెక్స్(Sensex) 802 పాయింట్ల నష్టంతో 71,140 ముగియగా… నిఫ్టీ 215 పాయింట్ల నష్టంతో 21,522 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. సోమవారం నాడు సెన్సెక్స్ 1240 పాయింట్లకు పైగా లాభాల్లో ఉంటే.. నిఫ్టీ 380 పాయింట్ల దాకా లాభపడింది. కానీ ఒక్కరోజులోనే పరిస్థితి తారుమారైంది.
ప్రపంచ మార్కెట్లలో IT, ఫైనాన్షియల్ షేర్లు మందకొడిగా ట్రేడ్ అయ్యాయి. HDFC బ్యాంక్(2.58 శాతం), SBI(2.12 శాతం), HDFC(2.09 శాతం), ఇండస్ ఇండ్ బ్యాంక్(2.02 శాతం) శాతం మేర పడిపోయాయి.
Published 30 Jan 2024