22 క్యారెట్ల బంగారం ధర లక్షకు చేరువైంది. ఇదే ట్రెండ్ కొనసాగితే లక్ష దాటడం ఖాయం. 24 క్యారెట్ల పుత్తడి(Gold) 10 గ్రాములకు హైదరాబాద్ లో రూ.1,08,490 పలికింది. నిన్న 1,07,620 ఉండగా, ఈరోజు రూ.870 ఎగబాకింది. ఈనెల 4న రూ.1,06,860 పలికిన రేటు ఈరోజు రూ.1,08,490 అయింది. అంటే ఈ రెండ్రోజుల్లోనే రూ.1,630 పెరిగి ఆల్ టైమ్ రికార్డ్ నమోదు చేస్తూనే ఉంది. ఇక 22 క్యారెట్ల ధర సైతం 10 గ్రాములకు రూ.99,450గా ఉంది. నిన్న రూ.98,650 ఉంటే ఇవాళ మరో రూ.800 పెరిగింది. వెండి(Silver) ఒక్కరోజులోనే కిలోకు రూ.2,000 పెరిగి రూ.1,38,000గా ఉంది.