
బంగారం ధరలు ఈరోజు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,360 పెరిగి రూ.1,10,290గా ఉంది. 22 క్యారెట్ల ధర సైతం రూ.1,250 పెరిగి రూ.1,01,110 అయింది. దీంతో 22 క్యారెట్ల పుత్తడి తొలిసారి లక్ష రూపాయలు దాటింది. వెండి కిలో రూ.1,40,000గా ఉంది. నిన్న 24 క్యారెట్లకు రూ.1,08,930, 22 క్యారెట్లకు రూ.99,850 పలికింది. ఇలా బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డు సృష్టిస్తూనే ఉన్నాయి.