
బంగారం ధరలు ఒక్కరోజులోనే భారీగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే ఈరోజు రూ.2,290 పెరిగింది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రా. ధర రూ.1,27,800 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,17,150గా ఉంది. నిన్న 24 క్యారెట్ల పుత్తడి రూ.1,25,510 పలికింది. కిలో వెండి రూ.రూ.1,82,000కు చేరింది. గత 4 రోజుల్లో 3 సార్లు పెరిగి రూ.5,500 అధికమైంది. ఇదే సమయంలో కిలో వెండి సైతం రూ.17,000 ఎగబాకినట్లయింది.
అమెరికా డాలర్ బలహీనపడటం, అక్కడి ప్రభుత్వ షట్ డౌన్ ముగింపుతో మార్కెట్లో జోష్ కనిపించింది. తాత్కాలిక నిధుల బిల్లును అమెరికా చట్టసభ సభ్యులు ఆమోదించడంతో ఫెడరల్ ప్రభుత్వం మూతపడే ప్రమాదం తప్పింది. దీంతో ఇన్వెస్టర్లు గోల్డ్ పై ఆసక్తి చూపారు.