దేశంలో టమాట ధరలు గత ఆరు నెలలతో పోల్చితే 700 శాతం పెరిగాయి. ఎప్పుడూ అనిశ్చితిలో కొట్టుమిట్టాడే టమాట ధరలు.. ప్రస్తుతం కొందరు రైతులను కోటీశ్వరుల్ని చేస్తున్నాయి. మహారాష్ట్రకు చెందిన ఓ రైతు.. వారంలోనే కోటీశ్వరుడిగా మారాడు. దిల్లీలో కిలో ధర రూ.178కి చేరగా.. జనవరి 1 నుంచి రేట్లను పరిశీలిస్తే 700 శాతం పెరిగింది. భారీ వర్షాలకు పంట కోల్పోయి సప్లయ్ నిలిచిపోవడంతో సరకు తగ్గడం, డిమాండ్ పెరగడంతో ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో సామాన్యుడే కాదు పెద్ద పెద్ద హోటళ్లు కూడా వాడలేని పరిస్థితికి చేరుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఇళ్లల్లో టమాట వాడకం బాగా తగ్గిపోయింది. మహారాష్ట్రకు చెందిన రైతు దంపతులు ఈశ్వర్ గైక్వాడ్, సోనాలి.. షార్ట్ పీరియడ్ లోనే కోట్లు సంపాదించారు. పశ్చిమ మహారాష్ట్రలోని జున్నర్ కు చెందిన ఈ కుటుంబం 12 ఎకరాల్లో పంట పండించింది. ఈ సమయంలో పంటను అమ్ముకోవడం ద్వారా 2.40 కోట్ల ఆదాయం అందుకుంది.
నిత్యం 60 నుంచి 70 మందికి ఉపాధి కల్పిస్తూ టమాట సాగు చేస్తున్న ఈశ్వర్ కు.. పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతంలోనే అతి పెద్ద సప్లయర్ గా పేరుంది. ఇప్పుడు ఏకకాలంలో 2.40 కోట్లు సంపాదించడంతో ఆ ప్రాంతంలో సెలెబ్రిటీగా మారిపోయాడు. ‘సరిగ్గా నెలన్నర క్రితం కిలో టమాట ధర రెండున్నర రూపాయలు ఉంది. 2021లో ఇదే సీజన్ లో రూ.20 లక్షలు నష్టపోయా’.. అని ఈశ్వర్ అన్నాడు. ఇప్పటికే 350 టన్నులు పంట అమ్మగా, కొన్నిరోజుల్లో ఇంకో 150 టన్నులు చేతికి వస్తుందని అంటున్నాడు. ఏటా టమాటను మూడు పంటలు పండిస్తామని… ఇప్పుడు వేసిన పంట మరో 120 నుంచి 140 రోజుల్లో చేతికందుతుందని చెబుతున్నాడు. ఇలా రేట్స్ హైక్ తో తన జీవితమే మారిపోయిందంటున్నాడు ఈశ్వర్.
This former is millianer