టమాట(Tomato) ధరలు ఇప్పుడిప్పుడే దిగివచ్చేలా కనిపించడం లేదు. 100, 150 అనుకుంటా కంటిన్యూగా పెరుగుతూనే ఉన్న టమాట ఈరోజు రూ.200 మార్క్ ను దాటింది. పంట ఎక్కువగా ట్రాన్స్ పోర్ట్ అయ్యే మదనపల్లె మార్కెట్లో ఈ ధర పలికింది. నాలుగైదు రోజులుగా రూ.150 నుంచి రూ.170 ఆ తర్వాత రూ.190 చేరుకున్న ఈ పంట… తాజాగా కిలో రూ.200కు అమ్ముడైంది. ‘A’ గ్రేడ్ రకానికి శనివారం నాడు ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లె మార్కెట్ లో ఈ రేంజ్ రేట్ పలికింది. ‘A’ గ్రేడ్ రకం శనివారం అక్కడకు 253 టన్నులు రాగా, ఆదివారం నాడు 240 టన్నులు మాత్రమే వచ్చింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ సహా మూణ్నాలుగు రాష్ట్రాల్లో పంట నేల రాలిపోయింది. దీంతో దిగుబడి తగ్గి డిమాండ్ అమాంతం పెరిగింది.
ఉత్తరాది రాష్ట్రాల్లో 15 రోజుల క్రితమే రూ.200 మార్క్ ను దాటిన టమాట ధర… తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం ఆ క్రెడిట్ సొంతం చేసుకుంది. రేట్లు భారీగా పెరగడంతో ఆ కాస్తా రైతులు కూడా సరకును మార్కెట్ కు తేవడం లేదు. మార్కెట్ లో కన్నా బయట ఎక్కువ రేట్ వస్తుండటంతో టమాటలను ఆ రీతిలోనే సాగుదారులు అమ్ముకుంటున్నారు.