డొనాల్డ్ ట్రంప్.. భారత్ పై అక్కసు చూపిస్తూనే ఉన్నారు. ప్రపంచ దిగ్గజ(World Top) కంపెనీల అధినేతలతోనూ భారతదేశంలో పెట్టుబడులు వద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. వైట్ హౌజ్ సిలికాన్ వ్యాలీలో హై ప్రొఫైల్ విందు ఇచ్చారు ట్రంప్. మెటా చీఫ్ జుకర్ బర్గ్, ఓపెన్ AI సీఈవో ఆల్ట్మన్, గూగుల్ CEO పిచాయ్, మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల హాజరయ్యారు. ‘మీరు ఎంత పెట్టుబడి పెడ్తున్నారు.. వేరేచోట నుంచి ఇక్కడకు వస్తున్నారు.. కుక్ తో నాకో సమస్య ఉంది.. నేను నిన్ను చాలా బాగా చూసుకున్నా.. మీరు భారత్ అంతటా విస్తరిస్తున్నారు.. ఇలా చేయడం ఇష్టం లేదు..’ అంటూ విరుచుపడ్డారు. భారత్ వద్దని, చైనాతో దూరంగా ఉండాలని కుక్ తో మే నెలలోనూ ట్రంప్ అన్నారు. సమస్యేంటంటే.. భారత్ లో ఫోన్ల వ్యవస్థ పెద్దగా లేకపోవడమే. https://justpostnews.com