లక్షల కోట్ల లావాదేవీలు(Transactions) జరుపుతూ భారత ఆర్థిక వ్యవస్థ రూపురేఖల్నే మార్చివేసింది UPI. డిజిటల్ పేమెంట్లు ప్రతి సామాన్యుడికీ చేరుకున్నాయి. ఇప్పుడదే తరహాలో ఈజీగా రుణాలు(Loans) అందించేలా RBI సరికొత్త ప్లాట్ ఫామ్ అమలు చేయడానికి రెడీ అయింది. త్వరలోనే దీన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయబోతున్నట్లు RBI గవర్నర్ శక్తికాంతదాస్ తెలిపారు.
రుణాలు తీసుకోవడాన్ని మరింత సులభం చేస్తూ యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్(ULI)కు శ్రీకారం చుట్టింది. బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థలు రుణాలు ఇవ్వడంలో ఈజీ ప్రాసెస్ అందుబాటులోకి వస్తుంది. తద్వారా గ్రామాలు, పట్టణాల్లోని ప్రజలతోపాటు చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు మేలు జరగనుంది.