ఉల్లిగడ్డల(Onions) ధరలు 3 వారాల నుంచి దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి. మొన్నటిదాకా(Recently) రూ.20 పలికిన ఉల్లి ప్రస్తుతం కిలో రూ.40కి చేరుకుంది. మరికొద్ది రోజుల్లో ఇది రూ.50-60 దాటే అవకాశముందన్న ప్రచారం ఉంది. అయితే పెరిగిన ధరల్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం 71,000 టన్నుల ఉల్లిగడ్డల్ని కొనుగోలు చేసింది.
పంట లేక…
గత 20 రోజుల్లో ఉల్లి ధరలు 30% నుంచి 50% పెరిగాయి. దేశంలోనే అత్యధికంగా సాగయ్యే మహారాష్ట్రలో కరవుతో ఉత్పత్తి తగ్గింది. దేశంలోని మొత్తం పంటలో 42% అక్కణ్నుంచే వస్తుంటే.. ఉత్పత్తి ఈసారి 15 నుంచి 20% తగ్గింది. అక్కడ 27 జిల్లాల్లో 20% నుంచి 45% వరకు లోటు(Deficit) వర్షపాతం(Rainfall) రికార్డయింది. అక్టోబరు వరకు కొత్త పంట వచ్చే ఛాన్స్ లేకపోవడంతో ఉల్లికి భారీ డిమాండ్ ఏర్పడింది.
దశల వారీగా…
ధరల్ని కట్టడి చేసేందుకు దశల వారీగా ఏటా 5 లక్షల టన్నుల పంటను సేకరించాలని మోదీ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో ప్రస్తుతం కేజీకి ఉన్న రూ.40-50 ధర క్రమంగా తగ్గుతుందని వినియోగ వ్యవహారాల శాఖ అంచనా వేసింది.