రైల్వే చరిత్రలో ఆధునికత(Modernization)ను సంతరించుకున్న వందే భారత్ ట్రెయిన్లు ఎంతటి ఆదరణ పొందుతున్నాయో చూస్తూనే ఉన్నాం. దీనికి మరిన్ని హంగులు అద్ది ఇప్పుడు కొత్తగా స్లీపర్ కోచ్ ల్ని ప్రవేశపెడుతున్నారు. అన్నీ కుదిరితే ఈ ఆగస్టు 15 నాటికి ఇవి పట్టాలపై పరుగులు తీస్తాయి.
రాజధాని, తేజాస్ ఎక్స్ ప్రెస్ లను మించి సౌకర్యాలు ఉండేలా ‘వందేభారత్’ స్లీపర్ రైళ్లు రెడీ అవుతున్నాయని రైల్వే వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతమున్న ‘వందేభారత్’ రైళ్లు కేవలం పగటిపూట మాత్రమే నడుస్తుండగా స్లీపర్ రైళ్లను 24 గంటలు నడిపేలా తయారవుతున్నాయి.
కొత్త రైలు ప్రత్యేకతలివే…
* 16 కోచ్ లకు గాను 11 AC 3 టైర్.. 4 AC 2 టైర్.. ఒకటి AC 1 టైర్ ఉంటాయి.
* 823 మంది జర్నీకి వీలుగా AC 3 టైర్లో 611 మంది.. AC 2 టైర్లో 188 మంది.. AC 1 టైర్లో 24 మంది కూర్చోవచ్చు.
* రాజధాని ఎక్స్ ప్రెస్ కు మిన్నగా ఎక్స్ ట్రా ఫెసిలిటీస్(Cushioning)తో కూడిన బెర్త్ లు ఉంటాయి.
* క్రీమ్, పసుపు రంగులతో కూడిన వెదురు(Wood)తో వాతావరణం(Ambiance) హాయిగా ఉంటుంది.