Vivo Y200 5G Price Cut in India : వివో Y200 5G ఫోన్ గతేడాది అక్టోబర్‌లో భారత మార్కెట్లో లాంచ్ అయింది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 1 SoC ద్వారా పనిచేస్తుంది. 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,800mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. ఇప్పుడు ఈ ఫోన్ కొత్త స్టోరేజ్ వేరియంట్లో అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. వివో ఇతర రెండు మోడళ్లకు ధర తగ్గింపును ప్రకటించింది. వివో Y27 4G, Vivo T2 5G వరుసగా గత ఏడాదిలో లాంచ్ అయ్యాయి.
వివో Y200 5G ఇప్పుడు 8GB + 256GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ధర రూ.23,999 ఉంటుంది. SBI, IDFC ఫస్ట్, బ్యాంక్ ఆఫ్ బరోడా, DBS బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ కస్టమర్లు రూ.2000 వరకు ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈ హ్యాండ్సెట్ 8GB + 128GB ఆప్షన్‌తో రూ. 21,999 కూడా లిస్టు అయింది. డెసర్ట్ గోల్డ్, జంగిల్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో అందిస్తోంది.
స్నాప్‌డ్రాగన్ 4 Gen 1 చిప్సెట్ ద్వారా ఆధారితమైన వివో Y200 5G ఫోన్ 6.67-అంగుళాల Full-HD+ (1,080 x 2,400 పిక్సెల్‌లు) AMOLED డిస్ప్లే, 64MP డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్, 16MP సెల్ఫ్ కెమెరాతో పనిచేస్తుంది. Android 13 ఆధారిత ఫన్‌టచ్ OS 13తో రన్ అవుతుంది. 44W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 4,800mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్సెట్ డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం ఐపీ54 రేటింగ్‌తో కూడా వస్తుంది.
వివో Y సిరీస్ ఫోన్‌పై డిస్కౌంట్లు, మరెన్నో బ్యాంకు ఆఫర్లు :
వివో Y27 4G మోడల్ 6GB + 128GB వేరియంట్ ఇప్పుడు భారత మార్కెట్లో రూ.11,999 తక్కువ ధరకు అందుబాటులో ఉందని Vivo ప్రకటించింది. SBI, Yes బ్యాంక్, IDFC ఫస్ట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, DBS బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ కస్టమర్లు రూ.1000 వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. మరోవైపు వివో T2 5G మోడల్ 6GB + 128GB, 8GB + 128GB వేరియంట్లను ఇప్పుడు భారత మార్కెట్లో వరుసగా రూ.17,999, రూ.15,999 తక్కువ ధరలకు కొనుగోలు చేయవచ్చు. కొత్త ధరలు ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి వస్తాయి.
ఆకర్షణీయమైన కెమెరా ఫీచర్లు, స్పెషిఫికేషన్లు :
బుర్గుండి బ్లాక్, గార్డెన్ గ్రీన్ కలర్‌వేస్‌లో అందించే వివో Y27 4G ఫోన్ 6.64-అంగుళాల Ful-HD+ (2,388 x 1,080 పిక్సెల్‌లు) LCD ప్యానెల్‌ను కలిగి ఉంది. మీడియాటెక్ హెలియో జీ85 SoC, 44W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ 50MP డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ఫ్రంట్ కెమెరాలో 8MP సెన్సార్ ఉంటుంది. వివో T2 5G నైట్రో బ్లేజ్, వెలాసిటీ వేవ్ షేడ్స్‌లో అందుబాటులో ఉంది. క్వాల్కామ్ స్పాప్ డ్రాగన్ 695 SoC, 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,500mAh బ్యాటరీ, 6.38-అంగుళాల అమోల్డ్ (1,080 x 2,400 పిక్సెల్‌లు) డిస్ప్లే, 64MP డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్ ఉన్నాయి.
Published 02 Feb 2024