మీరు కొన్న వస్తువు(Product)లో లోపాలున్నాయా.. అవి నాసిరకమని గుర్తించారా లేక డేట్ అయిపోయిందా.. మరి దీనిపై ఫిర్యాదు(Complaint) చేయడమేలా.. వినియోగదారుల ఫోరమ్ ఉన్నా ఎలా కన్సల్ట్(Consult) అయ్యేది.. ఇప్పటిదాకా జనాల్లో ఉన్న అనుమానాలివి. కానీ దీనికో పరిష్కారం చూపుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇంటి నుంచే…
వస్తువుల్లో లోపాలపై ఎవరైనా ఇంటి నుంచే ఫిర్యాదు చేసేలా కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ.. ప్రజలకు అందుబాటులో ఉండే వ్యవస్థ తీసుకువచ్చింది. ‘వాట్సప్ చాట్ బాట్’ సేవల ద్వారా కన్జ్యూమర్స్ కి మరింత అందుబాటులో ఉండేలా చూస్తుంది.
ఎలా చేయాలంటే…
మొదట ఈ వాట్సప్ నంబరుకు (88000 01915)కు హాయ్ మెసేజ్ పెట్టాలి.
అక్కణ్నుంచి వచ్చే సూచనల ఆధారంగా వివరాలివ్వాలి.
మీ డీటెయిల్స్ నేషనల్ కన్జ్యూమర్స్ కమిషన్ లో రికార్డవుతాయి.
తర్వాత ఈ కేసు వివరాలు జిల్లా వినియోగదారుల కమిషన్ కు చేరతాయి.
జిల్లా వినియోగదారుల కమిషన్ మీ కంప్లయింట్ ను పరిశీలిస్తుంది.
కేసు పరిష్కారమయ్యే వరకు మీకు సలహాలు, సూచనలు ఇస్తుంది.
వాటితోపాటు 1800114000 లేదా 1915 నంబర్ కు కూడా కాల్ చేయవచ్చు.
ఈ నంబర్లు పొద్దున 8 నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటాయి.
పరిష్కారమైన కేసులు https:/consumer-helpline.gov.in/ లో ‘NCH సక్సెస్ స్టోరీస్’ పేరిట ఉంటాయి.