వేగంగా విస్తరిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(Artificial Intelligence)పై అవగాహన కల్పించేందుకు ప్రముఖ దిగ్గజ సాఫ్ట్ వేర్ సంస్థ ‘విప్రో(Wipro)’… ఢిల్లీ IITలో ఎక్సలెన్స్ సెంటర్ ప్రారంభించింది. AIతోపాటు ML(Machine Learning) విధానాలపై స్టూడెంట్స్ కు ‘విప్రో’తోపాటు ఢిల్లీ IIT కలిపి జాయింట్ గా అవగాహన కల్పిస్తారు. ప్రపంచంలో తలెత్తుతున్న సమస్యలు, వాస్తవాలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన గైడ్ లైన్స్ పై IIT స్టూడెంట్స్ కు క్లాసెస్ ఉంటాయి. ‘విప్రో’, ఢిల్లీ IITకి చెందిన చీఫ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్స్ అంతా ఈ మోడ్రన్ టెక్నాలజీపై బోధిస్తారు. విద్యార్థుల్లో నైపుణ్యాల్ని వెలికితీసేందుకు ‘విప్రో’కు చెందిన పరిశోధన, అభివృద్ధి(Research & Development) టీమ్ తమ IITతో జతకట్టడం ఫ్యూచర్ లో గొప్ప మైలురాయి కానుందని ఢిల్లీ IIT హెడ్ ప్రొఫెసర్ మౌసమ్ అన్నారు.
AI ఎకో సిస్టమ్ ద్వారా నూతన ఆవిష్కరణల కోసం ‘విప్రో’ భారీ మొత్తాన్ని వెచ్చించబోతున్నది. రానున్న రోజుల్లో 1 బిలియన్ డాలర్ల(రూ.8,000 కోట్లకు)పైగా కేటాయించబోతున్నట్లు ప్రకటించింది.