
‘అన్ని ఆస్తుల్ని అమ్ముకున్నా.. ఇల్లు కూడా లేదు.. ఆస్తులు బరువు అవుతాయనుకున్నా.. అవి ఒక రకమైన వ్యాధి వంటివి.. లగ్జరీ లైఫ్ ని పట్టించుకోను..‘ అని చెప్పారు. ఈ బిలియనీర్ 2020, 2021 మధ్య రెండేళ్లలో 7 ఇళ్లను అమ్మేశారు. ఆ తర్వాత టెక్సాస్ లోని స్పేస్ ఎక్స్ సైట్ దగ్గర్లోని చిన్న ఇంట్లోకి మకాం మార్చారు. ఆ ఇంటి విస్తీర్ణం కేవలం 375 చదరపు అడుగులు. 17 ఏళ్ల వయసులో రోజుకు 1 డాలర్ తో ఫాస్ట్ ఫుడ్ తిని బతికిన మస్క్.. ప్రతి అదనపు డాలర్ ను బిజినెస్ కోసం ఖర్చు చేశారు. ఒకసారి 10 లక్షల డాలర్లతో మెక్ లారెన్ F1ను కొని యాక్సిడెంట్ చేశారు. నా వేగం చూడు అంటూ దూసుకుపోయి కంట్రోల్ తప్పడంతో.. అది గాల్లోకి ఎగిరి కూలిపోయింది. ఆ తర్వాత టెస్లా తప్ప మళ్లీ వేరే కార్ల జోలికి పోలేదని ‘బెంజింగా’ అనే సంస్థ.. తన రిపోర్టులో తెలిపింది.