
‘ధురంధర్-2’ ఎంతగా దుమ్మురేపుతుందో చూస్తూనే ఉన్నాం. అయితే అందులోని పాత్రల కోసమే ఎంతోకాలంగా వెతికామంటున్నారు క్యాస్టింగ్ డైరెక్టర్ ముఖేశ్ ఛాబ్రా. రెహమాన్ డెకాయిత్ గా అక్షయ్ ఖన్నా అదరగొట్టాడు. ఈ రోల్ ను ముగ్గురు నటులు తిరస్కరించారట. ‘యెలీనా జమాలి’గా సారా అర్జున్ యాక్టింగ్ అదుర్స్. ఈ క్యారెక్టర్ కోసం వెయ్యి ఆడిషన్లు చేశామన్నారు ఛాబ్రా. మార్చి 19న విడుదలై ఈ 14 రోజుల్లో దేశంలో రూ.959.37 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.1492.17 కోట్లు కొల్లగొట్టింది. ఇక రణవీర్ సింగ్ రోల్ కు ఎవరి గురించీ ఆలోచించలేదట. డైరెక్టర్ ఆదిత్యధార్, టీం అంతా హమ్జా పాత్రకు ఒక్క రణవీర్ ను తప్ప మిగతా ఎవర్నీ ఊహించుకోలేదట.