నటులు వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం వేడుకగా జరిగింది. హైదరాబాద్ లోని నాగబాబు నివాసంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఇరు కుటుంబాలకు సంబంధించిన పెద్దలు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. త్వరలో వీరి వివాహం జరగనుంది. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ జంట ప్రేమ గురించి చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నప్పటికీ సరైన క్లారిటీ రాలేదు. రెండు హృదయాలు… ఒకటే ప్రేమ అంటూ ఆహ్వాన పత్రిక ఒకటి బయటకు రావడంతో వీరిద్దరి నిశ్చితార్థం నిశ్చయమైందని అర్థమైంది. మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో వరుణ్-లావణ్య నటించారు.