69వ శోభ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్-2024లో ‘బలగం’, ‘దసరా’ సినిమాలు సత్తా చూపాయి. హైదరాబాద్ JRC కన్వెన్షన్లో నిర్వహించిన వేడుకల్లో.. వివిధ విభాగాల్లో ఉత్తమంగా(The Best) నిలిచిన చిత్రాల పేర్లను ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాలకు సంబంధించి అవార్డులు అందజేశారు.
ఉత్తమ చిత్రంగా ‘బలగం’, ఆ చిత్ర దర్శకుడు వేణు యెల్దండి బెస్ట్ డైరెక్టర్ గా నిలిచారు. ఇక ‘దసరా’లో నటించిన నాని ఉత్తమ నటుడిగా, కీర్తి సురేశ్ ఉత్తమ నటీమణులుగా అవార్డులు దక్కించుకున్నారు. ఈ రెండు సినిమాలే ఎక్కువ పురస్కారాలు(Awards) దక్కించుకున్నాయి.
అవార్డులు ఇలా…
విభాగం | పేరు, సినిమా |
ఉత్తమ చిత్రం | బలగం |
ఉత్తమ దర్శకుడు | వేణు యెల్దండి |
ఉత్తమ చిత్రం(విమర్శనాత్మక) | సాయి రాజేశ్(బేబి) |
ఉత్తమ నటుడు | నాని(దసరా) |
ఉత్తమ నటి | కీర్తి సురేశ్(దసరా) |
ఉత్తమ సపోర్టింగ్ నటుడు | బ్రహ్మానందం(రంగమార్తాండ) |
ఉత్తమ సపోర్టింగ్ నటుడు | రవితేజ(వాల్తేరు వీరయ్య) |
ఉత్తమ సపోర్టింగ్ నటి | రూప లక్ష్మీ(బలగం) |
ఉత్తమ నటుడు(విమర్శనాత్మక) | ప్రకాశ్ రాజ్(రంగమార్తాండ) |
ఉత్తమ నటుడు(విమర్శనాత్మక) | నవీన్ పొలిశెట్టి(మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి) |
ఉత్తమ గీత రచయిత | అనంత శ్రీరామ్(బేబి) |
ఉత్తమ నేపథ్య గాయకుడు | శ్రీరామచంద్ర(బేబి) |
ఉత్తమ నేపథ్య గాయని | శ్వేత మోహన్(మాస్టర్-మాస్టర్) |
ఉత్తమ అరంగేట్ర దర్శకుడు | శ్రీకాంత్ ఓదెల(దసరా) |
ఉత్తమ అరంగేట్ర దర్శకుడు | శౌర్యవ్(హాయ్ నాన్నా) |
ఉత్తమ అరంగేట్ర నటుడు | సంగీత్ శోభన్(మ్యాడ్) |
ఉత్తమ సినిమాటోగ్రఫీ | సత్యన్ సూర్యన్(దసరా) |
ఉత్తమ నృత్య దర్శకుడు | ప్రేమ్ రక్షిత్(దసరా) |
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ | కొల్ల అవినాశ్(దసరా) |