70వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో(Awards) ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ-2 ఎంపికైంది. ఉత్తమ హిందీ చిత్రంగా గుల్ మొహర్, బెస్ట్ కన్నడ పిక్చర్ గా కేజీఎఫ్-2 అవార్డుల్ని సొంతం చేసుకున్నాయి. కాంతారాతో ప్రపంచవ్యాప్తంగా సెన్సేషనల్ క్రియేట్ చేసిన రిషభ్ శెట్టి ఉత్తమ నటుడిగా నిలిచారు. ఉత్తమ హీరోయిన్లుగా నిత్య మీనన్, మానసి పరేఖ్ సంయుక్తంగా అవార్డును కైవసం చేసుకున్నారు.
అవార్డులిలా…
ఉత్తమ నటుడు….: రిషభ్ శెట్టి(కాంతారా)
ఉత్తమ నటీమణులు….: నిత్యమీనన్(తిరుచ్చిత్రాంబలం), మానసి పరేఖ్(కఛ్ ఎక్స్ ప్రెస్)
ఉత్తమ చిత్రం….: ఆట్టం(మలయాళం)
ఉత్తమ దర్శకుడు….: సూరజ్ బర్జాత్యా(ఉంచాయి)
ఉత్తమ సహాయనటుడు….: పవన్ రాజ్ మల్హోత్రా(ఒరియా)
ఉత్తమ సహాయనటి….: నీనా గుప్తా(ఉంచాయి)
ఉత్తమ పాపులర్ చిత్రం….: కాంతారా(కన్నడ)
ఉత్తమ తెలుగు చిత్రం….: కార్తికేయ-2
ఉత్తమ కన్నడ చిత్రం….: కేజీఎఫ్-2
ఉత్తమ తమిళ చిత్రం….: పొన్నియన్ సెల్వన్-1
ఉత్తమ కొరియోగ్రఫి….: తిరుచ్చిత్రాంబలం(జానీ మాస్టర్, సతీశ్ కృష్ణన్)
ఉత్తమ సంగీతం….: శివ, ప్రీతమ్(బ్రహ్మాస్త్ర)