ప్రపంచ సినీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మక పురస్కారాలైన(Awards) ఆస్కార్ సినిమా అవార్డుల వేడుక ఘనంగా జరుగుతున్నది. అమెరికా లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ వేదికగా 96వ అవార్డుల కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ అవార్డుల్లో ఓపెన్ హైమర్(Oppenhiemer) మూవీ పెద్దయెత్తున కొల్లగొట్టింది. బెస్ట్ ఫిల్మ్, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో పురస్కారాల్ని దక్కించుకుంది.
13 నామినేషన్లతో…
క్రిస్టోఫర్ నోలన్స్ విజువల్స్ ఎఫెక్ట్స్ మూవీ అయిన ఓపెన్ హైమర్.. ఈ అవార్డుల్లో 13 నామినేషన్లు దక్కించుకుంది. రెండో ప్రపంచ యుద్ధం(Second World War) ఆధారంగా తీసిన బయోపిక్ అయిన ఓపెన్ హైమర్ కు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి.
అవార్డులు ఇలా…
ఉత్తమ చిత్రం…: ఓహెన్ హైమర్
ఉత్తమ నటుడు…: కిలియన్ మర్ఫీ(ఓపెన్ హైమర్)
ఉత్తమ నటి…: ఎమ్మా స్టోన్(పూర్ థింగ్స్)
ఉత్తమ దర్శకుడు…: క్రిస్టోఫర్ నోలన్(పూర్ థింగ్స్)
ఉత్తమ సహాయ నటుడు…: రాబర్ట్ డౌనీ జూనియర్(ఓపెన్ హైమర్)
ఉత్తమ సహాయ నటి…: డేవైన్ జో రాండాల్ఫ్(ది హోల్డ్ వర్స్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ…: ఓపెన్ హైమర్
ఉత్తమ ఎడిటింగ్…: జెన్నీఫర్ లేమ్(ఓపెన్ హైమర్)