ప్రభాస్ కీ రోల్ లో నటించిన మైథలాజికల్ మూవీ “ఆదిపురుష్’.. ఏ OTTలో వస్తుంది అంటూ గత కొద్దిరోజులుగా నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఉత్కంఠకు తెరదించుతూ “ఆదిపురుష్’ OTT రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. అయితే మిగతా సినిమాలతో పోలిస్తే OTTలో “ఆదిపురుష్’ విడుదల కావడానికి ఎక్కువ టైం పట్టే అవకాశముంది. 8 వారాల తర్వాత అంటే రెండు నెలలకు ఇది OTTలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా 3D విజువల్సే ఇంట్రెస్టింగ్ గా మారాయి. ఓం రౌత్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీలో ప్రభాస్, కృతిసనన్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రధారులు. దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ కోసం ప్రభాస్ అభిమానులతోపాటు సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఓకే చెప్పడంతో శుక్రవారం వేకువజాము 4 గంటల నుంచే థియేటర్ల వద్ద సందడి ఏర్పడింది.