మత్తు పదార్థాల(Drugs) రాకెట్ తమిళనాడు సినీ ఇండస్ట్రీని ఊపేస్తోంది. ఇప్పటికే శ్రీరామ్ జైలుకెళ్తే.. ఇప్పుడు కృష్ణ అరెస్టయ్యారు. అన్నాడీఎంకే(AIADMK) నేత ప్రసాద్ ద్వారా శ్రీరామ్(అసలు పేరు శ్రీకాంత్)కు డ్రగ్స్ అలవాటయ్యాయి. ప్రసాద్ నిర్మించిన ‘తీంగిరై’ సినిమాకు రూ.10 లక్షలు రావాల్సి ఉండగా, డబ్బు అడిగినప్పుడల్లా శ్రీరామ్ కు కొకైన్ ఇచ్చారు. అలా 40 సార్లు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. అంజలి, ఇరువర్, తళపతిలో కృష్ణ నటించగా, ‘కళుగు’తో మంచి పేరు సంపాదించారు. ఈయన తండ్రి కె.కె.శేఖర్ నిర్మాత, పెద్దన్న విష్ణువర్ధన్ దర్శకుడు. పలువురు పోలీసులతోపాటు ఈ కేసులో మొత్తం 22 మంది అరెస్టయ్యారు.