కుండపోత వర్షాల వల్ల రెండు రాష్ట్రాల్లో(Telangana, AP) తలెత్తిన నష్టంపై ఆవేదన వ్యక్తం చేసిన ప్రముఖ సినీ కథానాయకుడు జూ.ఎన్టీఆర్.. బాధితులకు విరాళం ప్రకటించారు. ఒక్కో రాష్ట్రానికి రూ.50 లక్షల చొప్పున మొత్తంగా కోటి రూపాయలు ప్రకటిస్తూ ‘X’లో ట్వీట్ చేశారు.
‘వరద బీభత్సం తనను ఎంతగానో కలచివేసిందని, అతి త్వరగా ప్రజలు ఈ విపత్తు నుంచి బయటపడాలి..’ అంటూ NTR సందేశమిచ్చారు.