ప్రముఖ మలయాళ నటి అపర్ణా నాయర్ అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. ఆమెది సహజ మరణం కాదంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రైవేటు హాస్పిటల్ లో ప్రాణాలు కోల్పోయిందంటూ అందిన సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. కరమణ తాలియాల్ ప్రాంతంలోని తన ఇంట్లో అపర్ణ ఉరివేసుకుందని, వెంటనే హాస్పిటల్ కు చేర్చినట్లు సంబంధీకులు పోలీసులకు తెలిపారు. దీనిపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీసులు… అపర్ణ మృతిని అసహజ మరణంగా కేసు ఫైల్ చేశారు.
‘మేఘతీర్థం’, ‘మధుగావ్’, ‘ఆచాయన్స్’, ‘కాదలు పరాంజ కథ’ సినిమాల్లో ఆమె నటించారు. పలు టెలివిజన్ సీరియళ్లలోనూ అపర్ణ కీలక పాత్రలు పోషించారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలున్నారు.