చిన్న వయసులోనే పెద్ద రోగంతో మృతి.. వ్యాధిని తొలి దశలో గుర్తించకపోవడంతో అది ముదిరి ప్రాణాల మీదకు తెచ్చిందని బాధాకరమైన సందేశాలు(Messages). గర్భస్రావ కేన్సర్ తో యువనటి, మోడల్ ఇక లేరు అన్న వార్తలతో సంతాపాలే సంతాపాలు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బాధాకర(Sad) మెసేజ్ లే కనిపించాయి. హాట్ హాట్ వార్తలు, వివాదాలతో ఎప్పుడూ ట్రోలింగ్ లో ముందుండే ఆ నటీమణే పూనమ్ పాండే. 2011లో భారత్ వరల్డ్ కప్ సాధిస్తే పూర్తి నగ్నం(Nude)గా దర్శనమిస్తానని ప్రకటించి సంచలనం రేపింది. ఆ తర్వాత కూడా ఇలాంటి బోల్డ్(Bold) స్టేట్ మెంట్లతో అందరినీ ఆకర్షించే ప్రయత్నం చేసింది.
సర్వైకల్ క్యాన్సర్ పై అవేర్ నెస్…
గర్భాశయ క్యాన్సర్(Cervical Cancer)తో ఉన్నట్టుండి నటి, ప్రముఖ మోడల్ పూనమ్ పాండే కన్నుమూశారని రెండ్రోజుల క్రితం విస్తృతంగా ప్రచారం జరిగింది. బతికున్నప్పుడు ఎన్ని వివాదాలున్నా సరే.. అయ్యో పాపం ఆమె చనిపోయిందా అన్న బాధ అందరిలోనూ కనిపించింది. కానీ ఇవాళ ఆమె ఒక వీడియో రిలీజ్ చేసి అందర్నీ షాక్ కు గురిచేసింది. తాను ఇంకా బతికే ఉన్నానంటూ.. సర్వైకల్ క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకే అలా నటించినట్లు చల్లగా చెప్పింది. ‘సర్వైకల్ క్యాన్సర్ నాకు కాదు.. ఈ వ్యాధితో వేలాదిమంది మహిళలు చనిపోతున్నారు.. ఈ డిసీజ్ పై అవగాహన లేకపోవడమే మరణాలకు దారితీస్తున్నది.. దీనికి ఒకటే మార్గం… ముందస్తు పరీక్షలు, HPV వ్యాక్సిన్’… అంటూ ఆ వీడియోలో తెలియజేసింది.
నెటిజన్ల ఫైర్…
2013లో ‘నషా’ అనే మూవీతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది పూనమ్ పాండే(Poonam Pandey). అయితే ఈ విషయంలో పూనమ్ పాండే వ్యవహారశైలిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇదేం మాయ రోగమని తిట్టుకుంటూ పోస్టులు పెడుతున్నారు.
Published 03 Feb 2024