బాలీవుడ్ నటి, BJP ఎంపీ కంగనా రనౌత్ వివాదాల క్వీన్ గా మారిపోయారు. కంగన తాజా సినిమా ‘ఎమర్జెన్సీ’ తరచూ వాయిదా పడటం.. పంజాబ్ లో రిలీజ్ చేయొద్దంటూ బెదిరింపులు రావడంతో రివర్స్ కౌంటర్ ఇచ్చారు. ఇందిరాగాంధీ బయోపిక్ ఆధారంగా కంగన స్వీయ దర్శకత్వంలో తయారైన ఈ సినిమాలో.. తమ వర్గం గురించి తప్పుగా తీశారంటూ శిరోమణి గురుద్వార ప్రబంధక్ కమిటీ(SGPC) ఆమెకు లీగల్ నోటీసులు పంపింది.
థియేటర్ల(Theatres)లో విడుదల చేయొద్దని పంజాబ్ సర్కారు కూడా భావిస్తున్నది. సినిమాకు వ్యతిరేకం(Anti)గా ఖలిస్థాన్ మద్దతుదారులు స్టేట్మెంట్ ఇస్తూనే రిలీజ్ చేస్తే కంగనను చంపేస్తామని బెదిరించారు. వీటికి భయపడేది లేదంటూనే మూవీని ఎట్టిపరిస్థితుల్లోనూ రిలీజ్ చేస్తామని చెబుతున్నారామె.