బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ కి అనుకూలంగా ఢిల్లీ హైకోర్టులో తీర్పు వచ్చింది. అనుమతి లేకుండా పేరు ఉపయోగించడం గోప్యత, గౌరవమైన హక్కును ఉల్లంఘించడమేనని కోర్టు స్పష్టం చేసింది. AIతో ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేయడాన్ని జస్టిస్ తేజస్ కరియా తప్పుబట్టారు. పేరు వాడకంతో కొన్ని ఉత్పత్తులకు ఆమె మద్దతిస్తుందన్న ప్రచారం జరిగి దుర్వినియోగమయ్యే ప్రమాదముందన్న వాదనల్ని సమర్థించారు. URLలను 72 గంటల్లోపు తొలగించి ఆపరేటర్ల సమాచారాన్ని సీల్డ్ ఫార్మాట్లో అందించాలని గూగుల్ LLCని ఆదేశించారు. ఆ URLలను బ్లాక్ చేయాలని కేంద్ర IT శాఖకు కోర్టు ఆదేశాలిచ్చింది.