సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ 2014లో వివాహం కాగా 8 ఏళ్ల పాటు కాపురం సజావుగానే సాగింది. కానీ ఇద్దరి మధ్య కలతలు రావడంతో గతేడాది తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇక అప్పటి నుంచి తన ఇద్దరు పిల్లలతో సింగిల్‌గా ఉంటోంది ఐశ్వర్య. అయితే తాను త్వరలో ఓ తమిళ హీరోను పెళ్లి చేసుకోబోతున్నట్లు నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
ఐశ్వర్య రజనీకాంత్ తాజాగా ఓ రిసార్ట్‌లో కోలీవుడ్ హీరోతో కలిసి కనిపించడంతో తమిళ మీడియా వీరి పెళ్లి వార్తలపై కోడై కూస్తోంది. కానీ ఈ పుకార్లపై ఇప్పటి వరకు ఐశ్వర్య స్పందించలేదు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం తన దర్శకత్వంలో తండ్రి రజనీకాంత్ హీరోగా ‘లాల్ సలామ్’ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. కాగా ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.
ఇక ధనుష్ విషయానికొస్తే.. ‘కెప్టెన్ మిల్లర్’ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలిగించింది. ఇదే కాకుండా తన కెరీర్లో 50వ చిత్ర షూటింగ్పైనా ఇటీవలే అప్డేట్ ఇచ్చారు ధనుష్. ఆ మూవీ త్వరలోనే పట్టాలెక్కనుందని వెల్లడించారు.