
యంగ్ హీరో అఖిల్ అక్కినేని ‘ఏజెంట్’ ఎఫెక్ట్ నుంచి బయటకొచ్చాడు. ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై ఫోకస్ చేస్తున్నాడు. ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో ‘ఏజెంట్’ మూవీ భారీ డిజాస్టర్ కావడంతో తీవ్రంగా నిరాశపడ్డ అఖిల్.. ఆ డిప్రెషన్ నుంచి కోలుకోవడానికి కొంత టైమ్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. UV క్రియేషన్స్ బ్యానర్లో అఖిల్ నెక్ట్స్ మూవీ ఉండనుందని రూమర్స్ హల్ చల్ చేస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో ఫాంటసీ అడ్వెంచర్‌గా తెరకెక్కే ఈ మూవీకి ‘ధీర’ అనే టైటిల్ పరిశీలనలో ఉండగా.. అనిల్ కుమార్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారని టాక్.

నిజానికి అఖిల్ మార్కెట్ పెద్దగా లేదు. ఇప్పటి వరకు తను నటించిన చిత్రాలేవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన దాఖలాలు లేవు. అయినప్పటికీ మేకర్స్ బడ్జెట్ పరిమితులు లేకుండా ఈ సినిమా నిర్మించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ చిత్రంలో అఖిల్ సరసన అతిలోక సుందరి లేట్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ను హీరోయిన్గా తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇక డైరెక్టర్ విషయానికొస్తే.. తను గతంలో యువీ క్రియేషన్స్ రూపొందించిన ‘సాహో’ చిత్రానికి డైరెక్షన్ టీమ్‌లో పనిచేసిన అనుభవం ఉంది.