అక్కినేని నాగార్జున రెండో కుమారుడు, నటుడు అఖిల్ ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ విషయాన్ని నాగార్జునే స్వయంగా ‘X’లో పోస్ట్ చేశారు. జైనాబ్ రవ్దీజీ(Zainab Ravdjee)తో ఆయన ఎంగేజ్మెంట్ జరగ్గా, కాబోయే కోడలికి స్వాగతం అంటూ ప్రకటించారు. ఈ ఇద్దరికి సంబంధించిన ఫొటోను షేర్ చేసిన ఆయన… మిగతా వివరాల్ని త్వరలోనే తెలియజేస్తామన్నారు.
ఎవరీ జైనాబ్ రవ్దీజీ అంటూ అప్పుడే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో సెర్చింగ్ ప్రారంభమైంది. జుల్పీ రవ్దీజీ కుమార్తె అయిన ఈమె భారత్, లండన్, దుబాయి చుట్టివస్తుంటారు. ఈమె కూడా నటి అన్న ప్రచారం సాగుతుండగా, కొన్నేళ్ల క్రితం నుంచి ఈ ఇద్దరికీ పరిచయముంది. శోభిత ధూళిపాళ్లతో నాగచైతన్య వివాహం డిసెంబరు 4న అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగనుండగా.. ఇప్పుడు అఖిల్ ఎంగేజ్మెంట్ తో ఇతడి పెళ్లి ఎప్పుడా అన్న చర్చ మొదలైంది.