సంధ్య థియేటర్లో జరిగిన ఘటనపై తనకన్నా బాధపడేవారు మరెవరూ లేరని అల్లు అర్జున్ అన్నారు. ప్రేక్షకుల్ని అలరించడమే తన పని అని, థియేటర్ అంటే దేవాలయంగా భావిస్తామన్నారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి(Health Condition) గురించి ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నామన్నారు. అల్లు అర్జున్ తర్వాత ఆయన తండ్రి అరవింద్ మాట్లాడారు. మంత్రి కోమటిరెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన వెంటనే రూ.25 లక్షల చెక్కును బాధిత కుటుంబానికి అందించారు, కానీ మీరు మాత్రం ఇంకా చెక్కు ఇవ్వలేదని మీడియా ప్రశ్నించింది. దీనికి అరవింద్ జవాబిస్తూ.. పుష్ప-2 హీరో, డైరెక్టర్, నిర్మాత అందరూ కలిసి ఆ కుటుంబానికి అండగా ఉంటారన్నారు. ఒక్కొక్కరు కాకుండా ఒక ట్రస్ట్ మాదిరిగా ఏర్పాటు చేసి ఎంత సహాయం చేయాలో అంత చేస్తామన్నారు. అయితే అందుకు సంబంధించిన వివరాల్ని బయటపెట్టలేదు.