సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి ప్రాణాలతో పోరాడుతున్న శ్రీతేజ్ ను సినీ నటుడు అల్లు అర్జున్ పరామర్శించారు. భారీ బందోబస్తు(Security) నడుమ కిమ్స్ హాస్పిటల్ చేరుకోగా… అంతకుముందే FDC(ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్) ఛైర్మన్ దిల్ రాజు అక్కడకు వచ్చారు. శ్రీతేజ్ పరిస్థితిపై ఎప్పటికప్పుడు బులెటిన్లు వెలువడుతుండగా, పరామర్శ కోసం రెండ్రోజులుగా అర్జున్ ప్రయత్నిస్తున్నారు. అయితే పోలీసులు ఇందుకు ఒప్పుకోకపోడంతో మొన్న, నిన్న అది సాధ్యం కాలేదు. కానీ గంట టైం లోపు బాలుణ్ని పరామర్శించి వెళ్లిపోవాలని, అందుకు తాము సెక్యూరిటీ కల్పిస్తామని రాంగోపాల్ పేట పోలీసులు మరోసారి నోటీసులివ్వడంతో ఈ నటుడు కిమ్స్ ఆసుపత్రికి రాగలిగారు.