సినీ నటుడు అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ హైదరాబాద్ నాంపల్లి కోర్టు తీర్పునిచ్చింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చింది. సంధ్య థియేటర్(Sandhya Theatre) తొక్కిసలాట ఘటనలో ఆయనపై కేసు నమోదైంది. A11గా ఉన్న అల్లు అర్జున్ కు అంతకుముందే హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే రెగ్యులర్ బెయిల్ కోసం కింది కోర్టును ఆశ్రయించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేయడంతో సెక్యూరిటీ కారణాల రీత్యా ఆయన వర్చువల్ గా నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. రూ.50 వేల పూచీకత్తుతో రెండు బాండ్లు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతోపాటు ఎప్పుడు అడిగినా పోలీసు విచారణకు హాజరు కావాలని, సాక్షుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభావితం చేయరాదని ఆదేశాల్లో స్పష్టం చేసింది.