అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఇరువర్గాల్లో ఉత్కంఠ ఏర్పడింది. ఈ పిటిషన్ పై అత్యవసర(Emergency) విచారణ చేపట్టాలంటూ ఆయన న్యాయవాది విపరీత ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే విచారణ సోమవారం నిర్వహిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. లంచ్ మోషన్ పిటిషన్ ను ఉదయమే వేయాల్సి ఉండగా, మధ్యాహ్నం ఒకటిన్నరకు దాఖలు చేయడం సరికాదని ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. బుధవారమే పిటిషన్ వేశామని అర్జున్ తరఫు అడ్వొకేట్ వివరించారు. అయితే సోమవారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కోరారు. ఆయన్ను అరెస్టు చేసిన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు సినీ ప్రముఖులతోపాటు ఆయన అభిమానులు భారీగా చేరుకుంటున్నారు.