సినీ నటుడు అల్లు అర్జున్ సీరియస్ వార్నింగ్(Warning) ఇచ్చారు. పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్లో జరిగిన ఘటనలు ఇప్పటికే తీవ్ర వివాదాస్పదం కాగా.. నిన్న ఆయన స్పందించారు. శాసససభ వేదికగా CM మాట్లాడిన తీరుతో నిన్న సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి వివరాలు తెలియజేశారు. తాజాగా ఈరోజు సైతం ఆయన మరోసారి రెస్పాండ్ అయ్యారు. అభిమానులు(Fans) బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఎవరినీ వ్యక్తిగతంగా కించపరిచేలా పోస్టులు పెట్టొద్దని హెచ్చరించారు. తప్పుడు(Fake) ఐడీలు, ప్రొఫైళ్లతో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో పోస్టులు పెడుతున్న వారి పట్ల కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని ‘X(పాత ట్విటర్)’ ద్వారా హెచ్చరికలు చేశారు. ఫ్యాన్స్ ముసుగులో కొందరు ఫేక్ పోస్టులు పెడుతూ అలజడి సృష్టించేలా తయారవుతున్నారని, నెగెటివ్ పోస్టులు పెట్టేవారికి నిజమైన ఫ్యాన్స్ దూరంగా ఉండాలని కోరారు.