ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్లో జరిగిన ఘటనలో తన ప్రమేయం లేదని, ఆ కేసులో తన పేరు కొట్టేసేలా ఆదేశాలివ్వాలంటూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని(High Court) ఆశ్రయించారు. పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో సంధ్య అనే వివాహిత మృతిచెందగా ఆమె కుమారుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. దీనిపై చిక్కడపల్లి పోలీసులు సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ తోపాటు అల్లు అర్జున్ పై కేసు ఫైల్ చేశారు.