ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్(Polling) దగ్గర పడుతున్న కొద్దీ పార్టీల ప్రచారం ఊపందుకుంది. TDP-జనసేన-BJP కూటమి(Alliance) ఒకవైపు, YCP మరోవైపు అన్నట్లుగా పెద్దయెత్తున ప్రచారం సాగిస్తున్నాయి. గత ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి ఓటమి పాలైన జనసేనాని పవన్ కల్యాణ్ మరోసారి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. అయితే ఆయన గెలుపుపై ఇప్పటికే విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన కుటుంబం పవన్ కు పూర్తి మద్దతు పలుకుతున్నది.
పవన్ ను గెలిపించాలంటూ ఆయన అన్న చిరంజీవి ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా పిలుపునిస్తే ఇప్పుడు ఆయన మరో కుటుంబ సభ్యుడు సైతం గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. కల్యాణ్ గెలుపుపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘X’ వేదికగా ట్వీట్ చేశారు. ‘మీ ఎన్నికల ప్రయాణానికి నా హృదయపూర్వక మద్దతు ఉంటుంది.. మీరు ఎంచుకున్న మార్గం చూసి నేను ఎప్పుడూ గర్వపడతా.. ప్రజాసేవకు అంకితమవ్వాలన్న మీ ఆలోచన చూసి ఉప్పొంగిపోతుంటా.. మీ ఆకాంక్షలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నా..’ అంటూ ట్వీట్ చేశారు.