‘అరుంధతి’, ‘బాహుబలి’ తర్వాత అలాంటి విభిన్న కథాశంతో సినిమా చేస్తోంది అనుష్క షెట్టి. వ్యాపార రంగంలో అపారంగా దూసుకుపోతున్న మహిళను కావాలని దెబ్బకొట్టిన స్టోరీలైన్ తో.. క్రిష్ డైరెక్షన్ లో రాబోతున్న సినిమాకు టైటిల్ రివీల్ చేశారు మేకర్స్. పేరుమోసిన బిజినెస్ ఉమెన్(Business Woman) గా అనుష్క నటిస్తున్న ఈ సినిమాకు ‘ఘాటీ’ టైటిల్ ని చిత్ర యూనిట్ ప్రకటించింది. తనను దెబ్బకొట్టిన ప్రత్యర్థులపై బాధిత బిజినెస్ ఉమెన్ ఎలా ప్రతీకారం(Revenge) తీర్చుకుందన్నదే ఈ సినిమా కథ.
అనుకోకుండా బయటకు…
డ్రగ్స్ కేసులో పోలీసుల నోటీసులు అందుకున్న డైరెక్టర్ క్రిష్.. హైదరాబాద్ నార్కోటిక్స్ అధికారుల ముందుకు వచ్చే సమయంలో ఈ సినిమా టైటిల్ బయటకు పొక్కింది. ఫిల్మ్ కు సంబంధించిన పోస్టర్, టైటిల్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో దర్శన(Unveiled)మిచ్చింది. తల మొత్తం శాలువా కప్పుకుని ముఖం అటువైపు తిప్పుకుని అనుష్క నడుస్తున్న పోస్టర్ ను విడుదల చేశారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టెయిన్మెంట్స్, UV క్రియేషన్స్ ఆధ్వర్యంలో సాయి మాధవ్ బుర్రా, చింతకింది శ్రీనివాసరావు సినిమాను నిర్మిస్తున్నారు.
ఓటీటీ ప్లాట్ ఫామ్ లో…
‘ఘాటీ’ మూవీ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. థియేట్రికల్ రిలీజ్ అనంతరం ఇది అమెజాన్ ప్రైమ్ ద్వారా OTTలోకి అడుగుపెట్టనున్నట్లు సదరు సంస్థ ప్రకటించింది. అనుష్క-క్రిష్ కాంబినేషన్ లో ఇంతకుముందు ‘వేదం’ సినిమా వచ్చి బంపర్ హిట్ సాధించింది.