సినీ హీరో అల్లు అర్జున్ కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట(Relief) లభించింది. ఆయనపై ఉన్న కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. ఎన్నికల నియమావళి(Code) ఉల్లంఘించారంటూ నమోదైన కేసు కొట్టివేయాలని ఆయన పిటిషన్ వేశారు. AP ఎన్నికల సమయంలో నంద్యాలలో పర్యటించారు అల్లు అర్జున్. ఈ సినీ నటుణ్ని చూసేందుకు భారీగా జనం చేరుకున్నారు. అయితే పర్మిషన్ లేకుండా జన సమీకరణ చేశారంటూ కంప్లయింట్ అందింది. దీంతో సెక్షన్ 144 కింద కేసు ఫైల్ చేయడంతో.. క్వాష్ చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారాయన. వివరాల్ని పరిశీలించిన న్యాయస్థానం.. కేసు కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.