పవన్ కున్న ఫ్యాన్స్ ఏంటో మరోసారి రుజువైంది. అభిమానుల కోసమే పవన్ కల్యాణ్ ‘బ్రో’ అనే సందేశం సినిమాలో ఉంటుంది. పవన్ ఎనర్జీ, పవన్ డ్యాన్స్ ను అభిమానులు హోరెత్తిస్తున్నారు. PSPK మూవీ అంటే ఆడియన్స్ తోపాటు అభిమానుల్లోనూ విపరీతమైన ఆసక్తి, హంగామా ఉంటుంది. స్టార్టింగ్ టూ ఎండింగ్ వరకు ప్రతి సీన్ ను ఆయన ఫ్యాన్స్ కోసమే అన్నట్లుగా తయారు చేసిన తీరు ఆకట్టుకుంటోందని ప్రేక్షకులు అంటున్నారు. మరోవైపు థియేటర్ల వద్ద సందడి కనిపిస్తోంది. షోస్ అన్నీ హౌజ్ ఫుల్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. టైమ్ తక్కువే అయినప్పటికీ సినిమాను పవన్ తన భుజాలపై మోశారంటూ ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి.
‘వినోదయ సిత్తం’ రీమేక్ గా రూపుదిద్దుకున్న ఈ సినిమాకి సముద్రఖని దర్శకుడు. ఆడియన్స్, ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ‘బ్రో’ మూవీ.. శుక్రవారం నుంచి థియేటర్లలో సందడి చేస్తోంది. థియేటర్ల వద్ద భారీ కటౌట్లు ఏర్పాటు చేసి డ్యాన్సులు చేశారు. హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ కు వచ్చిన అకీరా.. అభిమానులతో కలిసి సినిమా చూశారు. సాయిధరమ్ తేజ్ ది మెయిన్ లీడ్ అయినా సినిమా మొత్తాన్ని పవన్ నడిపించినట్లు ఉంది. ఈ సినిమా ద్వారా ఆయన రేంజ్ ఏంటో మరోసారి రుజువైందని ఫ్యాన్స్ గర్వంగా చెబుతున్నారు.