జగపతి బాబు ప్రధాన పాత్రలో నటించిన ‘రుద్రంగి’ చిత్రం జులై 7న విడుదల కానుంది. అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమతా మోహన్ దాస్, విమలా రామన్ తదితరులు నటించారు. అయితే ఈ మూవీ ప్రిరిలీజ్ ఈవెంట్‌ను గురువారం (జూన్ 29) సాయంత్రం నిర్వహించారు. ఈ వేడుకకు నందమూరి బాలకృష్ణతో పాటు తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఇక ఈవెంట్లో బాలకృష్ణ మాట్లాడటానికి మైక్ అందుకోగానే.. ‘కోకాకోలా పెప్సీ బాలయ్య బాబు సెక్సీ’ అనే స్లోగన్స్ అభిమానుల నుంచి వినిపించాయి. దీనికి రియాక్ట్ అయిన బాలయ్య.. నన్ను సెక్సీ అంటే, ఇక్కడున్న సుమ, మమతా మోహన్ దాస్ ఫీలవుతారని చమత్కరించారు.
ఇక అంతకుముందు యాంకర్ సుమ.. బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చినపుడు నేను, ఆయన వచ్చారని చెప్పకుండానే చప్పట్లు కొడతారా? అని వ్యాఖ్యానించింది. అయితే ఆమె వ్యాఖ్యలపై స్పందించిన బాలయ్య.. సుమకు అప్పుడప్పుడు చెంప దెబ్బలు అవసరం. అయితే మనమే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పాపం ఆ రాజీవ్ కనకాల ఈమెతో ఎలా బతుకుతున్నాడో ఏంటో’ అని సుమను కాసేపు ఆటపట్టించాడు.