
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇటీవలే ‘ఛత్రపతి’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తెలుగులో ప్రభాస్ హీరోగా రాజమౌళి రూపొందించిన ‘ఛత్రపతి’కి హిందీ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. కానీ ఈ మూవీ డిజాస్టర్ కావడంతో ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు సిద్ధమయ్యాడు. ‘పరంపర’ వెబ్ సిరీస్ డైరెక్టర్ విశ్వతో ‘స్పై’ ఫిలిమ్ ఫైనల్ చేసినట్లు సమాచారం. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ చిత్రంలో తను డ్యూయల్ రోల్లో కనిపించనుండటం విశేషం.
ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుండగా.. యూనివర్సల్ స్పై కాన్సెప్ట్ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలని పట్టుదలగా ఉన్నాడు బెల్లంకొండ. ఇదిలా ఉంటే.. ‘భీమ్లా నాయక్’ డైరెక్టర్ సాగర్ చంద్రతో బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పటికే ఒక సినిమా చేస్తుcడగా.. ఈ మూవీకి ‘టైసన్ నాయుడు’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు టాక్. అయితే, దీని గురించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా.. ఈ సినిమాను రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు.