అల్లు అర్జున్ కు భారీ ఊరట లభించింది. ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. సుదీర్ఘ వాదనల అనంతరం సొంత పూచీకత్తుపై ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఆయన పెట్టుకున్న క్వాష్ పిటిషన్ పై విచారణ నిర్వహించగా.. మధ్యంతర బెయిల్ పై పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభ్యంతరం తెలిపారు. అయితే రెగ్యులర్ బెయిల్ పై నాంపల్లి కోర్టునే ఆశ్రయించాలని స్పష్టం చేసిన హైకోర్టు.. రూ.50 వేల పూచీకత్తు(Bond)తో నాలుగు వారాల మధ్యంతర(Interim) బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే చంచల్ గూడ జైలుకు వెళ్లిన అల్లు అర్జున్.. హైకోర్టు ఆదేశాలు అందగానే బయటకు రానున్నారు.