
‘అర్జున్ రెడ్డి’ మూవీతో సెన్సేషనల్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం రణబీర్ కపూర్‌తో ‘యానిమల్’ సినిమా చేస్తున్నారు. నేషనల్ క్రష్ మందన్న కథానాయికగా నటిస్తుండగా.. టీ-సిరీస్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇక ఈ ప్రాజెక్ట్ కోసం నార్త్, సౌత్ ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్ చేస్తుండగా.. ఆగస్టు 11న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ తేదీ నుంచి తప్పుకుని.. మరో డేట్ ను త్వరలోనే ప్రకటిస్తామని అధికారికంగా వెల్లడించారు. ఇదిలా ఉంటే.. ఆగస్టు 11న మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ‘యానిమల్’ రిలీజ్ వాయిదా నిర్ణయంతో ఇప్పుడు ఆ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లుకు హెల్ప్ అయ్యే అవకాశం ఉంది.

‘యానిమల్’ వాయిదా పడడం మెగాస్టార్ ‘భోళా శంకర్’కు బిగ్ రిలీఫ్‌గా చెప్పుకోవచ్చు. అంతకు ఒక్కరోజు ముందుగానే సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన ‘జైలర్’ మూవీ విడుదల కానుంది. ఆ మరుసటి రోజే ‘భోళా శంకర్’ రిలీజ్ కానుండగా.. అదే రోజున ‘యానిమల్’ ప్రేక్షకుల ముందుకొస్తే కలెక్షన్లపై ప్రభావం చూపేది. ఎందుకంటే ‘యానిమల్’ పాన్ ఇండియా ప్రాజెక్ట్. కానీ తాజా నిర్ణయంలో చిరంజీవి సినిమాకు బాక్సాఫీస్ వద్ద పెద్దగా పోటీ లేకుండా పోయింది.
ఇక ‘భోళా శంకర్’ విషయానికొస్తే.. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమన్నా భాటియా కథానాయిక. ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రంలో చిరంజీవి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తోంది. మెలోడి బ్రహ్మ మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందించారు.