
బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర(Dharmendra) మరణించారని వస్తున్న వార్తలు నిజం కాదని ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఇంకా ఆయనకు చికిత్స అందుతోందని ధర్మేంద్ర కుమార్తె ఈషా డియోల్ తెలిపారు. ‘మా నాన్న పరిస్థితి నిలకడగా ఉంది.. మేం చెప్పేవరకు ఎలాంటి నిర్ణయానికి రావొద్దు..’ అని స్పష్టం చేశారు. ఆయనకు ముంబయి బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో వైద్యమందిస్తున్నారు.