మోహిత్ సూరి డైరెక్షన్ లో వచ్చిన రొమాంటిక్ సినిమా ‘సయ్యారా(Saiyaara)’ రికార్డులు సృష్టిస్తోంది. అహాన్ పాండే, అనీత్ పడ్డా తెరంగేట్రం చేశారు. దేశ చరిత్రలో హయ్యెస్ట్ ఓపెనింగ్ వసూళ్ల మూవీగా నిలిచింది. జులై 8న రిలీజైన ‘సయ్యారా’ను 9.75 కోట్ల మంది వీక్షిస్తే, ఫస్ట్ డే రూ.25 కోట్లు కొల్లగొట్టింది. 2018లో రూ.8.76 కోట్లు వసూలు చేసిన ‘ధడక్’ మూవీదే హిందీలో ఇప్పటిదాకా రికార్డ్. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 3.8 లక్షల టికెట్లు అమ్మి రూ.9.39 కోట్లు సాధించింది ‘సయ్యారా’. ఆషిఖీ-2, ఏక్ విలన్ సినిమాలతో గుర్తింపు పొందారు మోహిత్. ఏక్ విలన్ సైతం ఓపెనింగ్ డే నాడు రూ.16.70 కోట్లు తెచ్చిపెట్టింది.